IPL 2022: ఐపీఎల్ లో నేడు కీలక పోరు..గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కి

ఐపీఎల్ 20202,15 వ ఈ సీజన్లో తొలి ఫైనలిస్టు ఎవరో తేలిపోయే సమయం ఆసన్నమైంది. నేడు (మంగళవారం) గుజరాత్, రాజస్థాన్ మధ్య జరగనున్న పోరులో గెలిచిన జట్టు నేరుగా ఆదివారం జరగనున్న ఫైనల్ కు అర్హత సాధించనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫైయర్-2 రూపంలో మరో అవకాశం దక్కనుంది. సీజన్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న హార్దిక్ పాండ్యా సేన అదే జోష్ తో ఫైనల్ కి చేరాలని చూస్తుంటే.. అండర్ డాగ్స్ గా అడుగుపెట్టి సంచలనం రేపాలని రాజస్థాన్ కృతనిశ్చయంతో ఉంది.

ఓవరాల్ గా చూస్తే ఇరుజట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్, బౌలింగ్ ,ఆల్రౌండర్ల విషయంలో గుజరాత్ వైపు కాస్త మొగ్గు కనిపిస్తున్నది. ఈ సీజన్లో మొత్తం నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ కి అడుగుపెట్టాయి. ఈ సీజన్లో తమ ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెంట్స్ ప్లే ఆఫ్స్ ఆడనున్నాయి. ఈ రెండు జట్లు కూడా తమ ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. పాయింట్ల పట్టిక లో తొలి, మూడో స్థానంలో నిలిచాయి. ఈ రెండింటితో పాటు రాజస్థాన్ రాయల్స్ ,రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. అయితే నేటి మ్యాచ్ లో గెలిచి నేరుగా ఫైనల్స్ లో అడుగుపెట్టే జట్టు ఏదో సాయంత్రం వరకు వేచి చూడాల్సి ఉంది.