వండర్ ఉమన్ ‘ప్రగతి.’.జిమ్‌లో చెమటోడుస్తున్న సీనియర్ నటి

-

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాల్లో సంప్రదాయ బద్ధమైన పాత్రల్లో కనబడే ఆమె రియల్ లైఫ్ లో మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సుల్లో కనబడుతుంటుంది.

ప్రగతికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు గతంలో సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. తాజాగా మరో వీడియో వైరలవుతోంది. సదరు వీడియోలో ఈమె జిమ్ లో చెమటోడుస్తోంది. వండర్ ఉమన్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ వీడియోను షేర్ చేసింది ప్రగతి. మీకు ప్రేమించిన దానిని ప్రేమించిన దానికంటే ఎక్కువ చేయండి అనే క్యాప్షన్ తో జిమ్ వీడియోను షేర్ చేసింది సీనియర్ నటి ప్రగతి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ప్రగతి రియల్లీ వండర్ ఉమన్’ అని ప్రశంసిస్తున్నారు. జిమ్ లో ఆమె చెమటోడుస్తున్న వీడియో చూసి ఫిట్ నెస్ ఫ్రీక్ అని కామెంట్స్ చేస్తున్నారు. డంబెల్ తో కష్టతరమైన ఎక్సర్ సైజెస్ చేస్తోంది ప్రగతి. ఈ మె నటించిన F3 ఈ నెల 27న విడుదల కానుంది. ఈ పిక్చర్ లో ప్రగతి పాత్రతో పాటు మిగతా అందరి పాత్రలు నవ్వులు పూయిస్తాని మేకర్స్ చెప్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

Read more RELATED
Recommended to you

Latest news