ఐపీఎల్ 2023: క్లాజెన్ వీరోచిత ఇన్నింగ్స్… 49 బంతుల్లో సెంచరీ !

-

ఐపీఎల్ లో భాగంగా ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు బెంగుళూరు జట్ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన హైద్రాబాద్ ఆ తర్వాత గేర్ మార్చి భారీగా పరుగులు రాబట్టింది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా కీపర్ మరియయు బ్యాట్స్మన్ హేన్రిచ్ క్లాజెన్ ఆకాశమే హద్దుగా తనలోని పవర్ అంతా చూపించి ఆడాడు. మొదటి బంతి నుండి బౌండరీలు ప్రధాన లక్ష్యం చేసుకుని బెంగుళూరు బౌలర్లకకు చుక్కలు చూపించాడు. ఇప్పటికే ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కు దూరం కాగా , కనీసం సొంత అభిమానుల మధ్యన తమ చివరి మ్యాచ్ ను విజయంతో ముగించాలని పట్టుదలతో ఆడిన క్లాజెన్ కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేసి కనుల విందును అందించాడు.

ఇతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు మరియు 6 సిక్సులు ఉన్నాయి. చివరికి 104 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news