ఈ రోజు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్యన మ్యాచ్ జరగనుంది. మరికొద్ది క్షణాల్లో టాస్ పడనుండగా.. ఇప్పుడు ఇక్కడ నెలకొన్న వాతావరణం పట్ల అనుమానం వస్తోంది. ఉప్పల్ స్టేడియం లో వాతావరణం అంతా కూడా పూర్తిగా మారిపోయి చల్లని గాలులు వస్తున్నాయి. అంతే కాకుండా కాసేపటి క్రితమే చిన్న పాటి వర్షం పడి ఆగిపోయింది. దీనితో మ్యాచ్ కు మధ్యలో వర్షం ఏమైనా వస్తుందా లేదా మ్యాచ్ కు ముందే వర్షం వచ్చే సూచనలు ఉన్నాయా అంటూ అటు అభిమానులు మరియు స్టేడియం నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఈ మ్యాచ్ జరగడం రెండు జట్లకు కూడా చాలా ముఖ్యం అని చెప్పాలి.
ఎందుకంటే ఢిల్లీ మరియు సన్ రైజర్స్ లు వరుసగా ఆఖరి నుండి మొదటి రెండు స్థానాలలో ఉన్నారు. ఈ మ్యాచ్ కనుక వర్షం కారణంగా రద్దు అయితే వీరి ప్లే ఆఫ్ అవకాశాలు దెబ్బ తినే అవకాశాలు లేకపోలేదు. మరి చూద్దాం వరుణుడు ఏమైనా కరుణిస్తాడా ?