ఐపిఎల్ 2023: బెడిసికొట్టిన శిఖర్ ధావన్ ప్రయోగం… !

-

గత రాత్రి ముగిసిన ఉత్కంఠ మ్యాచ్ లో రాజస్థాన్ గెలుపు బావుటా ఎగురవేసింది. నిన్న ధర్మశాలలో పంజాబ్ మరియు రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సంజు శాంసన్ సేన మరో రెండు బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ లో పలుమార్లు గెలుపు ఇరు జట్లతో దోబూచులాడింది. అలా చివరి ఓవర్ కు 9 పరుగులు చేయాల్సిన సమయంలో.. క్రీజులో యంగ్ జురెల్ ఉండగా, బౌలింగ్ కు లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ వచ్చాడు. దీనితో అందరిలోనూ ఆశ్చర్యం కలిగింది అని చెప్పాలి. ఆఖరి ఓవర్ లో చేయాల్సింది 9 పరుగులే స్పిన్నర్ కు ఎవరైనా ఇస్తారా అని అనుకున్నారు. కానీ అప్పటికే శిఖర్ ధావన్ తన దగ్గర ఉన్న అందరి బౌలర్లను వాడేశాడు.

 

ఇక తప్పక మిగిలిన ఒక్క ఓవర్ ను రాహుల్ చాహర్ చేత వేయించడానికి సిద్దమయ్యాడు. కానీ అదే శిఖర్ ధావన్ కొంప ముంచింది, మొదటి మూడు బంతులకు నాలుగు పరుగులు చేసిన రాజస్థాన్.. నాలుగవ బంతికి జురెల్ స్ట్రైట్ గా సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ ముగిసింది. శిఖర్ ధావన్ స్పిన్నర్ తో చేయించిన ప్రయోగం సైతం బెడిసికొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news