బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచులో కోల్ కాతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా సునాయాసంగా విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లు అద్భుతంగా రాణించడంతో కోల్ కతా నైట్ రైడర్స్ 20ఓవర్లలో 84పరుగులే చేయగలిగింది. ఐతే ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు 13.3ఓవర్లలోనే 8వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఈ మ్యాచులో 18పరుగులు చేసిన కోహ్లీ నాటౌట్ గా నిలిచాడు.
ఐతే ఈ మ్యాచులో రెండు ఫోర్లు బాదిన కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 500ఫోర్లు బాదిన వరుసలో రెండవ ఆటగాడిగా చేరాడు. 500ఫోర్లు కొట్టిన మొదటి ఆటగాడిగా శిఖర్ ధావన్ మొదటి స్థానంలో ఉండగా కోహ్లీ రెండవ స్థానంలో నిలిచాడు. శిఖర్ ధావన్ ఐపీఎల్ ఫోర్లు 575కాగా, కోహ్లీ 500, సురేష్ రైనా 493, గౌతమ్ గంభీర్ 491, డేవిడ్ వార్నర్ 475 ఫోర్లతో వరుసలో ఉన్నారు.