గ‌ర్ల్ ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్న మాక్స్ వెల్.. విష్ చేసిన ఆర్సీబీ

-

ఆస్ట్రేలియా స్టార్ ఆలౌ రౌండ‌ర్, ఐపీఎల్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ ఆట‌గాడు గ్లెన్ మాక్స్ వెల్ శుక్ర వారం రోజున‌ వివాహం చేసుకున్నాడు. తన గ‌ర్ల్ ఫ్రెండ్ అయిన వినీ రామ‌న్ ను మాక్స్ వెల్ వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని మాక్సీ త‌న సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. కాగ భార‌త సంత‌తికి చెందిన వినీ రామ‌న్, గ్లెన్ మాక్స్ వెల్ గ‌త కొద్ది రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు.

కాగ ఇద్ద‌రి కుటుంబ స‌భ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో శుక్ర వారం మాక్స్ వెల్ పెళ్లి పీఠ‌లు ఎక్కారు. 18.03.2022 జీవితంలో మ‌ర్చిపోని రోజు అంటూ త‌న సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి గురించి అధికారికంగా ప్ర‌క‌టించాడు. కాగ గ్లెన్ మాక్స్ వెల్ వివాహం సంద‌ర్భంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది.

గ్లెన్ మాక్స్ వెల్ – వినీ రామ‌న్ ల‌కు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే గ్లెన్ మాక్స్ వెల్ – వినీ రామన్ పెళ్లి ఫోటోను కూడా అభిమానుల‌తో పంచుకుంది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న గ్లెన్ మాక్స్ వెల్ – వినీ రామ‌న్ ల‌కు ఆల్ ది బెస్ట్ అని రాసుకువ‌చ్చింది. కాగ గ్లెన్ మాక్స్ వెల్ స‌తీమ‌ణి త‌మ‌ళ‌నాడు సంత‌తికి చెందినది. కాబ‌ట్టి త‌మ త‌మిళంలో ప్రింట్ చేసిన‌ పెళ్లి ప‌త్రిక‌ను కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా లో అభిమానుల‌తో పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news