ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచులో కోహ్లీ టీమ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. స్కోర్లు సమంగా నిలిచాక సూపర్ ఓవర్లో ఎక్కువ పరుగులు చేసి బెంగళూరు ఈ విజయాన్ని చేజిక్కించుకుంది. ఐతే ఈ విషయమై ముంబై ఇండియన్స్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ముంబై ఇండియన్స్ స్కోరుని పరుగులు పెట్టించిన ఆటగాడు ఇషాన్ కిషాన్ ని సూపర్ ఓవర్లో బరిలోకి దింపకపోవడంతో అందరూ విమర్శలు చేస్తున్నారు.
దీనిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, వివరణ ఇచ్చినప్పటికీ విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్, ఇషాన్ కిషన్ ని సూపర్ ఓవర్లో పంపకపోవడంపై కామెంట్లు చేసాడు. రెండు నిమిషాల్లో ముగిసిపోయే సూపర్ ఓవర్ కి ఇషాన్ కి పంపకుండా, అతడు అలసిపోయాడని చెప్పడం సరైన పని కాదని అంటున్నాడు. పంజాబ్ కూడా ఢిల్లీపై ఇలాగే మ్యాచ్ చేజార్చుకుందని, మ్యాచులో 89పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ ని పక్కన పెట్టి, నికోలస్ పూరన్ ని సూపర్ ఓవర్లో పంపడం ద్వారా మ్యాచ్ చేజార్చుకుందని అన్నాడు.
99పరుగులు చేసి బెంగళూరు స్కోరుని సమం చేయడానికి యాభైశాతం పాత్ర పోషించిన ఇషాన్ ని అలసిపోయాడని, సూపర్ ఓవర్లో పంపకపోవడం వల్లే ముంబై గెలిచే మ్యాచుని మిస్ చేసుకుందని తెలిపాడు.