“కుంగ్ పూ” పాండ్య కెప్టెన్సీ పై ఆకాష్ చోప్రా కామెంట్స్ !

-

ఐపీఎల్ లో ఇండియా ఆల్ రౌండర్ మరియు టీ 20 లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్య గుజరాత్ టైటాన్ జట్టుకు సారధిగా ఉన్నాడు. గత సీజన్ నుండి ఐపీఎల్ జర్నీ స్టార్ట్ చేసిన గుజరాత్ టైటాన్స్ ను ట్రోఫీ విన్నర్ గా నిలబెట్టిన ఘనత హార్దిక్ పాండ్యకు దక్కింది. టీం లో ఉన్న ప్లేయర్స్ అందరినీ ఒకతాటిపైకి తెచ్చి ఎవరిని ఏ విధంగా వాడుకుని విజయాలను సాధించాలి అన్న విషయంలో హార్దిక్ పాండ్య బాగా పరిణితి చెందాడని చెప్పాలి. ఈ విషయాన్ని క్రికెట్ ప్రముఖులు అందరూ చెబుతున్నా, తాజాగా మాజీ క్రికెటర్ మరియు ప్రమయూఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా కుంగ్ పూ పాండ్య కెప్టెన్సీ ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. చోప్రా మాట్లాడుతూ పాండ్య తన యొక్క తెలివైన నిర్ణయాలతో జట్టుకు అలవోకగా విజయాలను అందిస్తున్నాడన్నారు.

రానున్న రోజుల్లో ది బెస్ట్ కెప్టెన్ గా మనముందు నిలుస్తాడని కితాబిచ్చారు. కాగా ప్రస్తుతం ఈ ఐపీఎల్ లో గుజరాత్ ఆడిన 7 మ్యాచ్ లలో అయిదు గెలిచి పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది. ఇక ముందు ముందు ఇంకా గొప్పగా ఆడి మళ్ళీ టైటిల్ కొట్టాలని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news