వివేకా మర్డర్ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో హత్యకు సంబంధించి చాలా కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తీగెలుస్తోంది. ఈయనకు సిబిఐ కోర్ట్ ఈ రోజు వరకు రిమాండ్ విధించింది, ఇక ఈ రోజుతో ముగుస్తుందనుకున్న రిమాండ్ ను కాస్తా మరో రోజులు పొడిగించి ఉదయ్ కుమార్ రెడ్డికి షాక్ ఇచ్చింది అని చెప్పాలి. కాగా ఇతను చెప్పిన సమాచారం ద్వారానే భాస్కర్ రెడ్డి మరియు అవినాష్ రెడ్డి ల మీద మరింత అనుమానం పెరిగినట్లుగా సిబిఐ వారు చెబుతున్నారు.
అందుకే అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేసి విచారణ జరిగితే కేసులో ఒక కీలక ఘట్టానికి చేరుకునే అవకాశం ఉంటుంది. మరి ముందు ముందు ఈ కేసులో ఇంకా ఏమి జరగనుందో తెలియాల్సి ఉంది.