రాజస్థాన్ అతని స్థానంలో హోల్డర్ ను బ్యాటింగ్ కు పంపుంటే …

-

నిన్న జరిగిన డబుల్ ధమాకాలో ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను అందించాయి. మొదట మ్యాచ్ లో రాజస్థాన్ మరియు బెంగుళూరు లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు, అలా బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు నిర్ణీత ఓవర్ లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అనంతరం పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు మొదటి ఓవర్ లోనే బట్లర్ డక్ అవుట్ రూపంలో భారీ షాక్ తగిలింది. ఆ తర్వాత జైస్వాల్ మరియు పడిక్కల్ లు నెమ్మదిగా ఆడుతూ విజయానికి చేరువ చేశారు. అయితే పడిక్కల్ వేగంగా ఆడే క్రమంలో అవుట్ అవడంతో రాజస్థాన్ కు కష్టాలు స్టార్ట్ అయ్యాయి, ఆ ఆవెంటనే జైస్వాల్ అవుట్ అవ్వడం.. శాంసన్ కూడా ఎక్కువ సేపు నిలబడకపోవడంతో చేయాల్సిన రన్ రేట్ బాగా పెరిగిపోయింది.

ఆఖరి రెండు ఓవర్ లకు 33 పరుగులు చేయాల్సిన దశలో హెట్ మెయిర్ అవుట్ అయ్యాడు. ఆ స్థానంలో వెస్ట్ ఇండీస్ ఆల్ రౌండర్ హోల్డర్ కు బదులుగా అశ్విన్ ను పంపించడాన్ని అందరూ తప్పు బడుతున్నారు. ఒకవేళ హోల్డర్ వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news