ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో కోల్‌కత్త నైట్ రైడర్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు పై చేయి సాధించింది. సోమవారం కోల్‌కత్త, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్‌కత్తపై రాజస్థాన్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 218 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కత్తకు ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సునీల్ నరైన్ (0) ఒక్క బంతిని కూడా ఎదుర్కొకుండా.. రన్ అవుట్ తో వెనుదిరిగాడు. కానీ మరో ఓపెనర్ అరోన్ ఫించ్ (28 బంతుల్లో 58), శ్రేయస్ అయ్యార్ (85) పోరాడారు. వీరి తర్వాత కోల్ కత్త బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు.
నితీశ్ రానా (18), ఉమేశ్ యాదవ్ (21) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అయ్యారు. వరుసగా వికెట్ల్ పడటంతో కోల్‌కత్త ఓటమి వైపు అడుగులు వేసింది. చాహల్ 5 వికెట్లు తీసి కోల్‌కత్త నడ్డి విరిచాడు. అలాగే ఓబేడ మెక్కోయ్ 2, ప్రసిద్ధ కృష్ణ, అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు. దీనికి ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. బటర్ల్ (61 బంతుల్లో 103) సెంచరీతో కదం తొక్కాడు. పడిక్కల్ (24), సంజు శాంసన్ (38), హెట్ మెయర్ (26) కూడా రాణించడంతో 217 పరుగులు చేసింది. కాగ ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు చాహల్ కు దక్కింది.