గుడ్ న్యూస్.. కోడ్‌ ముగిసిన వెంటనే గురుకులాల్లో పోస్టింగులు

-

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో పోస్టింగులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల వారీగా ఎంపికైన వారికి కొత్త ఉపాధ్యాయులు, లెక్చరర్ల  పోస్టింగులు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా పూర్వ మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వచ్చే అభ్యర్థుల ఫలితాలు ప్రకటించలేదు. కోడ్‌ ముగిసిన వెంటనే వాటిని వెంటనే ప్రకటించేందుకు బోర్డు రంగం సిద్ధం చేసింది.

గురుకులాల్లో మొత్తం 9,210 పోస్టుల ఫలితాలన్నీ వెల్లడించిన తరువాత ఆయా సొసైటీల వారీగా నియామకాలు షురూ అవుతాయి. రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 9,210 పోస్టులకు గతేడాది ఆగస్టులో పరీక్షలు జరిగితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. గురుకుల పోస్టుల్లో అత్యధికంగా 4,006 టీజీటీ పోస్టులు ఉంటే.. ఆ తరువాత పీజీటీ, జూనియర్, డిగ్రీ లెక్చరర్‌ పోస్టులున్నాయి. ఇప్పటికే బీసీ గురుకుల సొసైటీలో పదోన్నతుల ప్రక్రియ దాదాపు ముగియగా… ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల్లో కూడా పూర్తయిన వెంటనే నియామకాలు జరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news