డూ ఆర్ డై మ్యాచ్ లో ముంబైపై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ముంబై పై హైదరాబాధ్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి.. 190 పరుగులకే పరిమితమైంది.
రోహిత్ శర్మ 48 పరుగులు, ఇషాన్ కిషన్ 43 పరుగులు, డేవిడ్ 46 పరుగులు చేసి.. ధాటిగా ఆడటంతోఓ దశలో హైదరాబాద్ పై ముంబై విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే.. భువనేశ్వర్ 1 వికెట్, ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు పొదుపుగా బౌలింగ్ చేయడం కారణంగా హైదరాబాద్ విజయ పతాకం ఎగురవేసింది.
ఇక మిగతా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు. ఇక అంతకు ముందుకు టాస్ ఓడిపోయి.. బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి… 193 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 194 పరుగలను లక్ష్యంగా నిర్దేశించింది. లక్ష్య చేధనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి.. 190 పరుగులకే పరిమితమై.. ఓటమి పాలైంది.