ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఎంత రసవత్తరంగా సాగిందో చూసాం. కరోనా కారణంగా ఆలస్యంగా మొదలైన ఐపీఎల్ క్రికెట్ ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. వచ్చే ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ల్- మే నెలల్లో జరగనుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటించాడు. దాంతో ఆటగాళ్ళ వేలం విషయమై సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ అభిమానుల్లో కేన్ విలియమ్సన్ పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
ప్రతీ ఏడాది తన ఆటతీరుతో సన్ రైజర్స్ అభిమానులందరినీ ఉర్రూతలూగిస్తున్న ఆటగాడిని కోల్పోతామేమో అన్న భయం పట్టుకుంది. ఈ విషయమై సన్ రైజర్స్ కెప్టెన్ వార్నర్ కి ప్రశ్నలు సంధించారు. దానికి వార్నర్ బదులిస్తూ, వేలం ఉన్నప్పటికీ, కేన్ విలియమ్స ని మేము కోల్పోమని, అతడు సన్ రైజర్స్ తరపున ఆడతాడని బదులిచ్చాడు. మరి వేలం వేసే సమయానికి ఫ్రాంచైజీల నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం. కేన్ విలియమ్స ని సన్ రైజర్స్ పోగొట్టుకుంటే అభిమానుల నుండి విమర్శలు ఎదుర్కోక తప్పదు.