ధోనీ క్రికెట్ కి గుడ్ బై చెప్పే రీజన్ అదే అయిందా…?

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. గత కొన్నాళ్ళ నుంచి ధోనీ క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది అనే ప్రచారం చాలా వేగంగా జరుగుతుంది. ఈ కరోనా సమయాన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఏమీ జరగకపోవడం ఒకటి అయితే ధోనీ గత ఏడాది ప్రపంచ కప్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం మరొకటి.

MS Dhoni after getting out in WC SF

ఈ నేపధ్యంలోనే ధోనీ క్రికెట్ నుంచి శాస్వతంగా తప్పుకునే అవకాశాలు ఉన్నాయని, కేవలం ఐపిఎల్ లో మాత్రమే ధోనీ ఆడే అవకాశం ఉంది అని మీడియా కోడై కూసింది. ఇక ఇప్పుడు ధోనీ తప్పుకోవడం వెనుక ప్రధాన కారణం టి20 ప్రపంచకప్ అని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ధోనీ చాలా ఆశగా టి20 ప్రపంచకప్ కోసం ఎదురు చూడగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అప్పటికి ధోనీ వయసు 40 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ధోనీ తప్పుకున్నాడని చెప్తున్నారు.