జాతీయ గీతం పాడుతూ ఎమోషనల్ అయిన క్రికెటర్ సిరాజ్..

Join Our COmmunity

మహమ్మద్ సిరాజ్.. హైదరాబాద్ కి చెందిన సిరాజ్ తన తొలి టెస్ట్ మ్యాచుని ఆస్ట్రేలియాతో ఆడాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇండియా టీమ్ లో ఆడుతూ మొదటి మ్యాచులోనే అద్భుతమైన పర్ ఫార్మెన్స్ ఇచ్చి అందరి దృష్టిలోఖి వచ్చాడు. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచులో మహమ్మద్ సిరాజ్ ఆకర్షణగా నిలిచాడు. ఐతే ప్రస్తుతం ఆస్ట్రేలియాతో రెండవ టేస్ట్ మ్యాచ్ జరగనుంది. మెల్ బోర్న్ వేదికగా మొదలైన ఈ మ్యాచులో మహమ్మద్ సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు.

జాతీయ గీతం పాడుతున్నప్పుడు సిరాజ్ కళ్ళలో నుండి కన్నీళ్ళు ధారగా కురిసాయి. జాతీయ గీతం పాడుతున్నంత సేపు అలానే కనిపించాడు. ఇటీవల తన తండ్రిని (మహమ్మద్ గౌస్) ని కోల్పోయిన సిరాజ్, అంత్యక్రియలకి హాజరు కాలేదు. కరోనా నిబంధనల మధ్య ఆస్ట్రేలియా నుండి హైదరాబాద్ కి తిరిగి రావడం కుదరక పోవడంతో అంత్యక్రియలకి హాజరు కాలేదు. మొదటొ టెస్ట్ మ్యాచులో తనదైన ప్రదర్శనతో అబ్బుర పరిచిన సిరాజ్, సిరీస్ మొత్తంలో అద్భుతంగా రాణించాలని అందరూ కోరుకుంటున్నారు.

TOP STORIES

సలాం.. మేజర్ మోహిత్ శర్మ..!

మేజర్ మోహిత్ శర్మ.. 19978 జనవరి 13వ తేదీన హర్యానాలోని రోహ్ తక్ గ్రామంలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు రాజేంద్రప్రసాద్, సుశీల. మేజర్ మోహిత్ శర్మను...
manalokam telugu latest news