ఆస్ట్రేలియాలో హైదరాబాద్ ఆటగాడి అద్భుత రికార్డు. కెరీర్లోనే అత్యుత్తమం..

-

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టెస్టులో హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. ఈ టెస్టులో ఐదు వికెట్లు తీసి అందరి చేత ఆహా అనిపించుకున్నాడు. మొత్తం 294పరుగులకు ఆలౌట్ అయిన ఆసీస్, ఇండియాకి 328పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఐతే మహమ్మాద్ సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టడంతో అందరి దృష్టిలో పడ్డాడు. మొన్నటికి మొన్న జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్న సిరాజ్, అత్యుత్తమ ప్రదర్శనతో తన జవాబు చెప్పినట్టయ్యింది.

లబుషేన్, స్మిత్, వేడ్, స్టార్క్, హేజుల్ వుడ్ వంటి కీలక ఆటగాళ్లని పెవిలియన్ కి పంపించి ఆసీస్ స్కోరుని కట్టడి చేయడంలో సిరాజ్ కీలక పాత్ర వహించాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాళ్ళ నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. కెరీర్ ఆరంభంలో ఐదు వికెట్లు తీసుకుని, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మహమ్మాద్ సిరాజ్ పై ఆకాష్ చోప్రా అభినంద పూర్వక ట్వీట్ చేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news