పాకిస్తాన్ కు భారీ షాక్… ఇండియా దెబ్బకు ఇద్దరు పేసర్లు అవుట్ !

-

ఆసియా కప్ లో భాగంగా రెండు రోజుల క్రితం ఇండియా మరియు పాకిస్తాన్ లు కీలకమైన సూపర్ 4 మ్యాచ్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ పై భారీ తేడాతో గెలిచి వరల్డ్ కప్ కు ముందు పూర్తి ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడీపోవడమే కాకుండా, ఇద్దరి ప్లేయర్ లను కూడా ఆసియా కప్ నుండి కోల్పోయింది. ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేసిన హరీష్ రాఫ్ కండరాల గాయం వలన, మరియు నసీం షా భుజం నొప్పి గాయాలు కారణంగా ఆ రోజు కనీసం బ్యాటింగ్ కు కూడా రాలేదు. ఇక ఆ మ్యాచ్ అనంతరం మెడికల్ టెస్ట్ లకు వెళ్లగా కొన్ని రోజులు చికిత్స మరియు విశ్రాంతి తీఉస్కోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీనితో వరల్డ్ కప్ కు అవసరం కాబట్టి పాకిస్తాన్ జట్టు యాజమాన్యం వీరిద్దరినీ వెంటనే పాకిస్తాన్ కు పంపింది.

దీనితో ఆసియ కప్ లో పాకిస్తాన్ ఆడనున్న మిగిలిన మ్యాచ్ లకు హరీష్ రాఫ్ నసీం షా లు దూరం అయ్యారు. ఇది నిజంగా పాకిస్తాన్ కు బిగ్ షాక్ అని చెప్పాలి..

Read more RELATED
Recommended to you

Latest news