టీమ్ ఇండియా కు స‌చిన్.. గంగూలీ ప్ర‌క‌ట‌న

-

క్రికెట్ కు దేవుడి గా భావించే స‌చిన టెండూల్క‌ర్ టీమిండియా సేవ‌లు అందించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న ను కూడా బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ చేశారు. ఇటీవ‌ల బ్యాక్ స్టేజ్ విత్ బోరియా అనే కార్య‌క్ర‌మం లో బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సచిన్ టెండూల్క‌ర్ అందిరి క‌న్నా భిన్నం డా ఉంటాడాని అన్నారు. అలాగే క్రికెట్ పరం గా పెద్ద మేధావి అని అన్నారు. అయితే మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ టీమ్ ఇండియా కు సేవ‌లు అందించేందుకు ఆస‌క్తి గా లేర‌ని అన్నారు. అయితే స‌చిన్ టెండూల్క‌ర్ లాంటి దిగ్గ‌జ ఆట‌గాళ్లు భార‌త జ‌ట్టు తో ఉండ‌టం వ‌ల్ల చాలా మేలు జరుగుతుంద‌ని అన్నారు.

అయితే స‌చిన్ లాంటి దిగ్గ‌జ ఆట‌గాళ్లు భార‌త్ జ‌ట్టు కు త‌ప్ప‌క సేవ‌లు అందిచాల‌ని అన్నారు. స‌చిన్ కూడా త‌ప్ప‌కుండా భార‌త్ జ‌ట్టు సేవ‌లు అందిస్తారని అన్నారు. అయితే ప్ర‌స్తుతం టీం ఇండియా కు సేవ‌లు అందించడానికి చాలా మంది సీనియ‌ర్ ఆట‌గాళ్లు జ‌ట్టు తో ఉంటున్నారు. ఇప్ప‌టికే మాజీ ఆట‌గాడు సౌర‌వ్ గంగూలీ బీసీసీఐ చీఫ్ గా ఉన్న విష‌యం తెలిసిందే. అలాగే మాజీ ఆట‌గాడు వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ కూడా ఎన్సీఏ చీఫ్ గా బాధ్య‌త‌లు తీసుకున్నారు. అలాగే స‌చిన్ కూడా తీసుకుంటార‌ని గ‌త కొద్ది కాలం గా ప్ర‌చారం సాగుతుంది. దీని పై గంగూలీ ఇలా స్పందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news