ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం బాగుండాలి. పోషకాహార లోపం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గడం, జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత, హృదయ సంబంధిత సమస్యలు మొదలైనవి వస్తూ ఉంటాయి. మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
ముఖ్యంగా 30 ఏళ్ళు దాటుతున్న స్త్రీ, పురుషులు మంచి ఆహారం తీసుకోవాలి. అనారోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే 30ల్లో ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఆహార పదార్థాలు వాళ్లకి బాగా సహాయపడుతాయి. అలానే సమస్యల బారిన పడకుండా చూసుకుంటాయి.
సోయాబీన్ :
సోయాబీన్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎముకల్ని దృఢంగా ఉండడానికి కూడా సోయాబీన్ మనకు సహాయం చేస్తుంది. అలానే ప్రోటీన్ లోపం కలగకుండా చూసుకుంటుంది. రోజుకి ఒకసారి సోయాబీన్స్ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
బ్రోకలీ:
బ్రోకలీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్స్ మరియు మినిరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇమ్యూనిటినీ కూడా ఇది పెంచుతుంది అలానే జబ్బులు బారిన పడకుండా చూసుకుంటుంది.
గ్రీన్ పీస్ :
ఇందులో కూడా ప్రొటీన్, ఐరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. పీస్ లో ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్ ఫాస్పరస్ మొదలైనవి అందుతాయి.
చేప:
చేప కూడా ఆరోగ్యానికి చాలా మంచిది 22 గ్రాముల ప్రోటీన్ 100 గ్రాములు చేపల్లో ఉంటుంది. హృదయ ఆరోగ్యానికి బ్రెయిన్ కి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. కనుక ఈ ఆహార పదార్థాలను 30ల్లో ఉండే వాళ్ళు తీసుకుంటే మంచిది.