సౌత్ ఆఫ్రికా టూర్‌లో టీమిండియా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా, సౌత్ ఆఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ కొనసాగుతుంది. ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్ లు కూడా జరిగాయి. కాగ ఈ రెండు మ్యాచ్ లలో టీమిండియా దారుణమైన ఓటమిని చెవి చూసింది. దీంతో ప్లేయర్ల పైనా క్రికెట్ దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు భగ్గుమంటున్నారు. టీమిండియా ప్రదర్శన పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సిరీస్ లో టీమిండియా స్వింగ్ బౌలర్ భూవనేశ్వర్ దారుణంగా నిరాశ పరుస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ లలో కనీసం ఒక్క వికెట్ ను కూడా తీయలేక పోయాడు.
అంతే కాకుండా రెండు మ్యాచ్ లలో 64, 67 పరుగులను కూడా సమర్పించుకున్నాడు. దీంతో భూవనేశ్వర్ పై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజా గా భూవనేశ్వర్ పై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూవనేశ్వర్ వరుసగా విఫలం అవుతున్నాడని అన్నారు. భూవీకి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అతని స్థానంలో దీపక్ చాహర్ జట్టులోకి తీసుకోవాలని.. ఆ విధంగా ఆలోచించాలని అభిప్రాయపడ్డాడు. 2023 ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకుని దీపక్ చాహార్ కు అవకాశాలు ఇవ్వాలని అన్నారు.