ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అద్భుతంగా రాణించిన ఉమ్రాన్ మాలిక్ దక్షిణాఫ్రికాలో జరిగిన టి – 20 సిరీస్ కోసం భారత జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికాతో టి-20 సిరీస్ లో ఆడలేకపోయినా.. ఐర్లాండ్ తో జరిగిన రెండు టీ-20ల సిరీస్ లో అతను ఆడాడు. రెండో టీ-20లో చివరి ఓవర్లో 17 పరుగులు డిఫెండ్ చేసి జట్టుకు 4 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు.
అయితే ఇంగ్లాండ్ తో జరిగే మూడు మ్యాచ్ల టి-20 వన్డే సిరీస్ లో మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ.. ఉమ్రాన్ మాలిక్ కు జట్టులో ఓ నిర్దిష్ట పాత్ర ఇవ్వడానికి మేనేజ్మెంట్ ప్రయత్నిస్తోందని చెప్పాడు.” అతను మా ప్లాన్లలో ముఖ్యమైన ప్లేయర్ గా ఉన్నాడు. అతని నుంచి జట్టుకు ఏమి అవసరమో కూడా మేము అతనికి తెలియ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. మేము కొంత మంది కుర్రాళ్లను జాతీయ జట్టు తరఫున ఆడించాలని ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే. ఉమ్రాన్ మాలిక్ కచ్చితంగా అందులో ఉంటాడు. ప్రపంచకప్ జట్టు కూర్పులో భాగంగా మేము అతడి పై ఓ కన్నేసి ఉంచాము. అతను జట్టు కోసం ఏం చేయగలడో చూడాలనుకుంటున్నాం.” అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.