చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్‌..కాదని తేలితే గుండు కొట్టించుకుంటావా !

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. అవినీతి చేయలేదని తేలితే గుండు కొట్టించుకుంటావా అని చాలెంజ్‌ చేశారు. ఇచ్చిన హామీల్లో 97, 98 శాతం ముఖ్యమంత్రి నెరవేర్చారని… వచ్చే రెండేళ్లలో ఏం చేస్తారన్నది ముఖ్యమంత్రి చెబుతారని పేర్కొన్నారు. నా రికార్డులను బ్రేక్ చేశారని గోబెల్స్ బాధపడి ఉండేవాడని.. కుప్పాన్ని చంద్రబాబు పూర్తిగా వదిలేశాడని మండిపడ్డారు.

జిల్లాకు ఎప్పుడు వచ్చినా చంద్రబాబుకు నేనే కనిపిస్తానని.. రాజంపేట ఎవరి జాగీరో చంద్రబాబుకు తెలియదా?? అని నిలదీశారు. రాజంపేట, నా గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే టీడీపీ అంత ఎక్కువగా దెబ్బ తింటుంది… నేను, నా కుటుంబం అవినీతికి పాల్పడుతున్నాం అని నిరూపిస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతానని పేర్కొన్నారు.

కాదని తేలితే చంద్రబాబు గుండు కొట్టించుకుంటావా అని ఛాలెంజ్‌ చేశారు. కుప్పంలో గెలవాలని పట్టుదలతో ఉన్నామని.. కుప్పంలో పోటీ చేసే పరిస్థితి చంద్రబాబుకు లేదని ఫైర్‌ అయ్యారు. చిత్తూరు జిల్లాలోని 14 స్థానాల్లో మాదే గెలుపని స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news