క్రికెట్-బాలీవుడ్.. ఈ రెండింటిది విడదీయరాని బంధం. అందుకే చాలా మంది క్రికెట్ స్టార్స్ బాలీవుడ్ స్టార్స్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అందులో మోస్ట్ డిజైరబుల్ అండ్ పవర్ కపుల్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ. వీళ్లిద్దరు కలిసి కనిపిస్తే చాలు అభిమానులకు పండగే. ఇక కోహ్లీ ఎప్పుడెప్పుడు అనుష్క గురించి మాట్లాడ్తాడా.. అనుష్క కోహ్లీ గురించి ఏం చెబుతుందా అని ఈగర్‌గా ఎదురుచూస్తుంటారు.
తాజాగా ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. అనుష్కను కలిసిన క్షణం తన జీవితమే మారిపోయిందన్నాడు విరాట్. ‘నా జీవితం మారిన క్షణం ఏంటని అడిగితే.. అనుష్కతో మొదలైన నా పరిచయమనే చెబుతాను. అప్పుడే జీవితంలో మరో కోణం చూశాను. నా ప్రపంచం మునుపటిలా లేదు. మారిపోయిందని అనిపించింది. మీరు ప్రేమలో పడినప్పుడు.. ఆ మార్పులు మీలో కూడా రావడం ప్రారంభమవుతాయి. చాలా విషయాలను అంగీకరించాలి. భవిష్యత్తుల్లో ఇద్దరు కలిసి ప్రయాణించాలి కాబట్టి అందుకు తగ్గట్టుగా మార్పు మొదలవుతుంది. అందుకే ఆమెను కలిసిన క్షణాన్ని లైఫ్ ఛేంజింగ్ మూమెంట్‌గా చెప్తాను’’ అంటూ విరాట్ వెల్లడించాడు.