అసలు క్రికెట్ గ్రౌండ్ లో అనుష్క శర్మకు ఏం పని…? సపోర్ట్ చేస్తూ.. వ్యతిరేఖిస్తూ నెటిజెన్ల కామెంట్స్

-

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో అరుదైన ఘనతను సొంత చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో 100 మ్యాచులు పూర్తి చేసుకున్న అతి కొద్ది మంది భారత క్రికెటర్ల సరసన విరాట్ కోహ్లీ కూడా చోటు సంపాదించుకున్నాడు. వందో టెస్ట్ పూర్తి చేస్తున్న 12వ ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రత్యేకమైన క్యాప్ ను బహుమతిగా ఇచ్చాడు. ఈ సమయంలో కోహ్లీ భావోద్వేగంతో మాట్లాడారు. తను ఈ ఘనత సాధించేందుకు అందరు టీం మెంబర్స్ సహకరించారని అన్నారు. 

ఈ వేడుకల్లో కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా పాల్గొన్నారు. అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ కోహ్లీ 100వ టెస్ట్ సెలబ్రేషన్లలో పాల్గొనడంపై నెటిజెన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది నెటిజెన్లు ఆమెను సపోర్ట్ చేయగా.. మరికొంత మంది వ్యతిరేఖిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘అసలు క్రికెట్ గ్రౌండ్ లో అనుష్క శర్మకు ఏం పని కొద్దిగా వివరించండి’’ అంటూ.., ‘‘క్రికెట్ గ్రౌండ్ లో అనుష్క శర్మ ఏం చేస్తోంది, నిబంధనల ప్రకారం ఆమెకు అనుమతి ఉందా..?’ అంటూ మరొక నెటిజెన్ ప్రశ్నించాడు. ‘‘ విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ లక్కీయెస్ట్ ఫ్యాన్ గర్ల్’’ అంటూ మరొక నెటిజెన్ కామెంట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news