టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా పై దాడి జరిగింది. పృథ్వీ షా తన స్నేహితుడు సురేంద్రతో కలిసి బుధవారం రాత్రి ముంబయిలో శాంతా క్రూజ్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ షాను చూసిన కొందరూ సెల్ఫీ దిగేందుకు ముందుకొచ్చారు. అయితే అక్కడున్న ఇద్దరితో మాత్రమే షా సెల్ఫీ దిగాడు.
మిగతా వారు తమతో కూడా ఫొటో దిగాలని కోరగా షా నిరాకరించడంతో వాళ్లంతా తమకు సెల్ఫీ ఇచ్చే తీరాలంటూ డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న షా స్నేహితుడు హోటల్ మేనేజర్‌కు కంప్లైంట్ చేశాడు. అక్కడికి వచ్చిన మేనేజర్ నిందితులను వెళ్లగొట్టాడు. అందులో ఓ యువతి ఇదంతా అవమానకరంగా ఫీలై.. షా, తన స్నేహితుడు కలిసి వెళ్తున్న కారును వెంబడించింది. అంతే కాకుండా పృథ్వీతో వాగ్వాదానికి దిగడమే కాదు అతడిపై దాడి కూడా చేసింది.
తమపై దాడికి పాల్పడిన నిందితులపై షా స్నేహితుడు ముంబయి ఓషివారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల్లో ఇద్దరైన సనా అలియాస్ సప్నా గిల్‌తో పాటు శోభిత్ ఠాకుర్‌ను అదుపులోకి తీసుకున్నారు.