వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఇంగ్లండ్, భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ కాస్త పైచేయి సాధించినట్టే కనిపిస్తోంది. తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత బ్యాటర్లు కాస్త తడబడ్డారు. తొలి ఓవర్ మెయిడిన్ కావడం గమనార్హం. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో సెంచరీని మిస్ చేసుకున్నాడు. 101 బంతుల్లో 87 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. మరో ఓపెనర్ శుభమన్ గిల్ కేవలం 9 పరుగులకే ఔట్ అయ్యాడు. టీమిండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు.
కే.ఎల్.రాహుల్ 39 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 47 బంతుల్లో 49 పరుగులు చేసి హాప్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ (04), జడేజా (08) పరుగులు చేశారు. చివరిలో బుమ్రా 16, కుల్దీప్ యాదవ్ 09 పరుగులు చేయడంతో జట్టు ఆ మాత్రం స్కోరు అయిన చేయగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 229/9 పరుగులు చేసింది. డేవిడ్ విల్లీ 3 వికెట్లు తీయగా.. 10 ఓవర్లు వేసి 2 మెయిడిన్ వేసి 45 పరుగులు ఇచ్చాడు. క్రిస్ వోక్స్ 2 వికెట్లు, ఆదిల్ రషీద్ 2 వికెట్లు, మార్క్ వుడ్ 1 వికెట్ తీశారు. భారత బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి మరీ.