లార్డ్స్ స్టేడియం వేదికగా శనివారం ఇంగ్లాండ్ మహిళా జట్టు పై జరిగిన మూడో వన్డే ఇంటర్నేషనల్ లో భారత మహిళా జట్టు ఘన విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో ఓడించింది. చివరి వన్డే ఆడిన స్టార్ బౌలర్ జులన్ గోస్వామికి ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే, చివరి ఆరు ఓవర్లలో 16 పరుగులు చేయాల్సిన దశలో చార్లీ డీన్ అనూహ్యంగా అవుట్ అయ్యింది.
44 ఓవర్ లో మంకడింగు మన్కడింగ్ ద్వారా అవుటు అయ్యిందామే. ఆ ఓవర్ ను దీప్తి శర్మ సందించింది. ఆ ఓవర్ మూడో బంతిని వేయడానికి దీప్తి శర్మ సిద్ధమైన తరుణంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న చార్లీ డీన్ క్రీజ్ ను దాటి బయటకు వచ్చింది. దీనితో ఆ బంతిని సంధించకుండానే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న వికెట్ల బెయిల్స్ ను గిరాటేసింది దీప్తి శర్మ.
అంపైర్ దీన్ని రన్ అవుట్ గా పరిగణించాడు. చివరి ఆరు ఓవర్లలో 16 పరుగులు చేయాల్సిన దశలో చివరి వికెట్ గా చార్లీ డీన్, మన్కడింగ్ ద్వారా అవుట్ కావడం ఇంగ్లాండ్ జట్టు ను దిగ్భ్రాంతికి గురి చేసింది. డ్రెస్సింగ్ రూమ్ లో ప్లేయర్లు షాక్ కు గురయ్యారు. అప్పటికే ఆమె 80 బంతుల్లో ఐదు ఫోర్లతో 47 పరుగులు చేసింది. అనూహ్యంగా సంభవించిన ఈ ఘటనతో చార్లీ కన్నీటి పర్యంతం అయింది.
Stay in the crease Rules are Rules.
Deepti Sharma 🔥Gore Bahut Rone Wale Hai 🤣🤣 #ENGvIND pic.twitter.com/EimxtBMG5Q
— AKASH (@im_akash196) September 24, 2022