ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత ఆర్చర్ల నుండి మెడల్స్ వస్తాయని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు జరిగిన అన్ని ఆర్చరీ ఈవెంట్స్ లో మన ఆర్చర్కు నిరాశపరిస్తునే వచ్చారు. కానీ మిక్స్డ్ ఆర్చరీలో మన భారత జట్టు సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. రౌండ్ 16లో ఇండోనేషియాపై విజయం అందుకున్న మన ఆర్చర్లు తాజాగా స్పెయిన్ పై క్వాటర్ ఫైనల్స్ లో విజయం అందుకున్నారు.
ధీరజ్ బొమ్మదేవరా, అంకిత భగత్ క్వాటర్ ఫైనల్ మ్యాచ్ లో 38-37 తో మొదటి సెట్ లో విజయం సాధించగా తర్వాతి సెట్ లో 38-38 తో టై చేసుకున్నారు. కానీ ఆయా తర్వాతి సెట్ లో 36-37 తేడాతో ఓడిపోయారు. ఇక తప్పక గెలవాల్సిన ఫైనల్ సెట్ ను 37-36 తో విజయం సాధించి 5-3 తో మ్యాచ్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఇక సెమీస్ లో మన ఆర్చర్లు ఏం చేస్తారో చూడాలి.