Asia Cup 2023 : ఆసియాకప్-2023 ఫైనల్ లో భారత బౌలర్లు చెలరేగడంతో లంక జట్టు 15.2 ఓవర్లలో 50 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వన్డేల్లో అత్యల్ప స్కోరుకు 6 వికెట్లు కోల్పోయిన జట్టుగా తన పేరిట ఉన్న రికార్డును తానే బ్రేక్ చేసింది.
2012లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో లంక 13 రన్స్ కు 6వ వికెట్ కోల్పోగా…. ఇవాళ ఆసియాకప్ లో భారత్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 12 పరుగులకే ఆరో వికెట్ కోల్పోయింది. అయితే… ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టును 50 పరుగులకే పరిమితం చేయడంతో మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు పడగొట్టి కీలకపాత్ర పోషించాడు. ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం 6.1 ఓవర్లలోనే సాధించింది. ఆ తర్వాత విజేతగా టీమిండియా 150,000 US డాలర్లను (రూ. 1 కోటి 25 లక్షలు) ప్రైస్ మనీగా అందుకుంది. రన్నరప్ గా శ్రీలంక జట్టుకు ప్రైజ్ మనీగా US $75,000 (రూ.62 లక్షలు) దక్కించుకుంది.