గత వన్ డే వరల్డ్ కప్ ను గెలుచుకుని ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఇండియాలో జరగనున్న వరల్డ్ కప్ లో ఎంట్రీ ఇవ్వనుంది. కాగా కప్ గెలిచిన జట్టులో ఓపెనర్ గా కీలక పాత్ర పోషించిన ఓపెనర్ బ్యాట్స్మన్ జాసన్ రాయ్ కు ఇంగ్లాండ్ క్రికెట్ సెలెక్టర్ ల్యూక్ రైట్ తీరని అన్యాయం చేశాడని చెప్పాలి. ఇంతకు ముందు ప్రకటించిన తాత్కాలిక వరల్డ్ కప్ టీం లో జాసన్ రాయ్ ను ఓపెనర్ గా లిస్ట్ లో ఉంచింది.. కానీ ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ సిరీస్ అనంతరం తమ నిర్ణయాన్ని మార్చుకుంటూ జాసన్ రాయ్ కు వ్యతిరేకంగా తీసుకుంది. తాజాగా ప్రకటించిన ఫైనల్ వరల్డ్ కప్ 15 మెంబర్స్ లిస్ట్ లో జాసన్ రాయ్ కు బదులుగా యంగ్ సెన్సషనల్ ప్లేయర్ హరీ బ్రూక్ కు అవకాశం కల్పించింది. కానీ కివీస్ తో జరిగిన వన్ డే సిరీస్ లో బ్రూక్ అంతగా రాణించకపోయినా అతనికి అవకాశం కల్పించడం విశేషం.
ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియా వేదికగా జాసన్ రాయ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతని సీనియారిటీ జట్టు విజయాలలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.