భారత దిగ్గజ ఫుట్ బాల్ మాజీ ఆటగాడు సురజిత్ సేన్ గుప్తా (71) ఈ రోజు కన్నుమూశారు. ఆయన గత కొద్ది కాలం నుంచి ఆనారోగ్యంతో బాద పడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి సురజిత్ సేన్ గుప్తా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగ సురజిత్ సేన్ గుప్తా కు జనవరి 30 న కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. అయితే ఈ రోజు ఆయన పరిస్థితి విష మించింది. దీంతో ఆయనను వెంటిలేషన్ సాయంతో చికిత్స అందించారు.
ఈ రోజు ఆయన పరిస్థితి విష మించింది. దీంతో ఈ రోజు సురజిత్ సేన్ గుప్త కన్నుమూశారు. కాగ సురజిత్ సేన్ గుప్తా గతంలో భారత ఫుట్ బాల్ జట్టు కు మిడ్ ఫిల్డర్ గా సేవలు అందించారు. 1970 ఆసియా గేమ్స్ లో సురజిత్ సేన్ గుప్తా భారత జట్టు తరపున ఆడాడు. ఆ సమయంలో భారత్ కు కాస్య పతకం సాధించడంలో సురజిత్ సేన్ గుప్తా కీలక పాత్ర వహించారు. అలాగే ఫుట్ బాల్ లో ఈస్ట్ బంగాల్ జట్టును బలంగా తీర్చి దిద్దారు. కాగ సురజిత్ సేన్ గుప్తా మరణంపై బంగాల్ రాష్ట్ర ముఖ్య మంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఫుట్ బాల్ లో ఆయన చేసిన సేవలను కొనియాడారు.