సొంతూరులో హార్దిక్ పాండ్యాకు గ్రాండ్ వెల్ కమ్

-

తాజాగా జరిగిన టీ 20 ప్రపంచకప్​లో టీమ్ఇండియా జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ విజయం అభిమానులకే కాదు క్రికెటర్లకు ఎంతో ముఖ్యమైంది. దీంతో అటు ప్లేయర్లు కూడా క్రికెట్ అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సూపర్ విక్టరీని సెలబ్రేట్​ చేసుకున్నారు. ఇక టీమిండియా ప్లేయర్లకు ఇప్పటికే భారత అభిమానులు నీరాజనాలు పట్టిన విషయం తెలిసిందే. మరోవైపు తమ సొంత ఊర్లకు వెళ్లిన ప్లేయర్లకు అక్కడి వారు గ్రాండ్​గానే వెల్​కమ్​ చెబుతున్నారు.

తాజాగా టీమిండియా స్టార్ ఆల్ ​రౌండర్ హార్దిక్ పాండ్యాకు కూడా తన సొంత ఊరు అయిన వడోదరలో ఘన స్వాగతం లభించింది. తమ అభిమాన క్రికెటర్​ను చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చారు.  ఓపెన్ బస్​లో అందరికీ అభివాదం చేస్తూ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ర్యాలీగా  తన ఇంటికి చేరుకున్నాడు హార్దిక్.  ఈ ర్యాలీ తర్వాత వడోదరలో హార్దిక్‌కు సన్మానం ఏర్పాటు చేశారు. ఈ వీడియోను పాండ్యా తన సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో షేర్ చేశాడు. తనకోసం ఈ ఏర్పాటు చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news