Hardika Pandya: హార్దిక్ పాండ్యా , నటాషాల విడాకులు తీసుకోనున్నారా ? అంటే అవుననే అంటున్నారు నెటిజన్స్. హార్దిక్ పాండ్యాకు తన భార్య నటాషా విడాకులు ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. ముంబై కెప్టెన్ హార్దిక్ పుట్టినరోజు సందర్భంగా నటాషా ఎలాంటి పోస్ట్, విషెస్ కానీ చెప్పలేదు. దీంతో వీరి రిలేషన్ లో చీలిక వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో ఈ జంట తాము ఎక్కడికి వెళ్లినా కూడా వాటికి సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేవారు. అయితే ఇటీవల వీరిద్దరి నుంచి ఎలాంటి ఫోటోలు లేకపోవడంతో ఈ రోమర్స్ మరింత ఎక్కువ అయ్యాయి. అయితే హార్దిక్ తన భార్య ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించకపోవడంతో ఇదంతా కూడా పుకార్లే అని ఆయన అభిమానులు కొట్టి పారేస్తున్నారు. అయినా బాలీవుడ్ హీరోయిన్ నటాషా, హార్దిక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు గడిచిపోతుంది. మరి ఈ వార్తలపై హార్దిక్ పాండ్యా , నటాషాలు స్పందించాల్సి ఉంది.