ఐపీఎల్: ఈ ఏడాది ఉత్తమ బౌలర్ అతనే.. రవిశాస్త్రి.

-

సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచులో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ ఓవర్లో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచులో బ్యాట్స్ మెన్ బంతిని బౌండరీలు దాటించారు. దాదాపుగా ప్రతీ బౌలర్ ని ఒక ఆట ఆడుకున్నారు. కానీ ఒక్క బౌలర్ మాత్రమే బ్యాట్స్ మెన్ పాలిట మేకులా మారాడు. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ కి తన బౌలింగ్ తో చుక్కలు చూపించాడని చెప్పాలి.

అతడే వాషింగ్టన్ సుందర్. నాలుగు ఓవర్లు వేసిన వాషింగ్టన్ సుందర్ కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇంకా ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. భారీ లక్ష్య చేధనలో సైతం పరుగులు ఇవ్వకుండా బౌలింగ్ చేయడమంటే చిన్న విషయం కాదు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ పై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. భారత క్రికెట్ టీమ్ కోచ్ రవి శాస్త్రి సుందర్ ని మెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సుందర్ అత్యుత్తమ బౌలర్ అంటూ కితాబిచ్చాడు. మరి రవిశాస్త్రి దృష్టిలో పడ్డాడంటే తొందరలో ఇండియా తరపున ఆడే అవకాశం వస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version