నిన్న ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తొలి వన్డేలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య వివాదాస్పద రీతిలో వేనుదిరగాల్సి వచ్చింది. థర్డ్ అంపైర్ చెత్త నిర్ణయం వల్ల వెనుదిరిగిన పాండ్యా అసలు అవుట లేక నాట్ అవుట అన్న సందేహం తలెత్తక మానదు. డారిల్ మిచెల్ వేసిన ఇన్నింగ్స్ 40 ఓవర్ లో బంతిని పాండ్యా ఫ్లిక్ చేయబోయి మిస్ అయ్యాడు.
ఈ నేపథ్యంలో బంతి కీపర్ టామ్ లాతమ్ చేతుల్లో పడింది. ఆ వెంటనే బేయిల్స్ కూడా కింద పడ్డాయి. పాండ్యా అవుట్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఫీల్డ్ ఎంపైర్ అంపైర్ ను రివ్యూ కోరాడు. రిప్లై లో కూడా బంతి ఎక్కడ నేరుగా వికెట్లను తాకిన దాఖలాలు కనిపించలేదు. అయితే టామ్ లాథమ్ గ్లోవ్స్ మాత్రం వికెట్లను తాకినట్లు కనిపించింది. అదే సమయంలో బంతి కూడా లాతమ్ చేతుల్లో పడింది. లతమ్ బంతి అందుకోకముందే బేయిల్స్ ఎగురగొట్టినట్లు పరిగణించిన థర్డ్ అంపైర్ పాండ్యాను బౌల్డ్ గా ప్రకటించి అవుట్ ఇచ్చాడు.
Was Hardik Pandya really out ??#CricketTwitter looks like keeper gloves hit bells .. pic.twitter.com/2ycbZzCDX4
— Paresh Deshmukh (@PareshD12462540) January 18, 2023