2023 వన్డే ప్రపంచకప్ అర్హత కోసం ఈ ఏడాది జులై 30 నుంచి సూపర్ లీగ్ ప్రారంభంకానున్నట్లు ప్రకటించింది ఐసీసీ. తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య నిర్వహించనున్నట్లు తెలిపింది. తొలిసారిగా నిర్వహిస్తున్న వన్డే ప్రపంచకప్ సూపర్ లీగ్ జులై 30 నుంచి ప్రారంభంకానున్నట్లు ఐసీసీ ప్రకటించింది. తొలి మ్యాచ్ సౌంథాప్టన్ వేదికగా ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య జరగనుంది. ఈ విషయాన్ని ఐసీసీ జనరల్ మేనెేజర్ జెఫ్ అల్లార్డైస్ స్పష్టం చేశారు.
ఐసీసీ శాశ్వత సభ్యదేశాలైన 12 జట్లతో పాటు 2015-17 టోర్నీ విజేతైన నెదర్లాండ్ ఈ సూపర్ లీగ్‌లో పాల్గొంటాయి. ప్రతి జట్టు స్వదేశంలో మూడు సిరీస్‌లు, విదేశాల్లో మూడు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది.ఈ సూపర్ లీగ్ ద్వారా భారత్‌లో జరిగే 2023 ప్రపంచకప్ అర్హతకు నిర్ణయించనున్నారు. వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి 7 స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. మిగిలిన టీమ్‌ల అర్హత కోసం ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునట్లు తెలిపాడు ఇంగ్లాండ్ జట్టు సారథి ఇయాన్ మోర్గాన్.