కోహ్లీ నాతో 20 నిమిషాలు మాట్లాడితే తిరిగి ఫామ్ లోకి వస్తాడు – సునీల్ గవస్కర్

-

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ సాధించి దాదాపు మూడు ఏళ్ళు అవుతుంది. అయితే కోహ్లీ పైన మాజీ క్రికెటర్లు ఫోకస్ చేస్తున్నారు. కోహ్లీ ని సెలక్టర్లు పక్కన పెట్టాలి అంటూ ఇటీవల మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కోహ్లీ కి అండగా నిలబడ్డారు సునీల్ గవాస్కర్.కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడానికి తనకు తెలిసిన సలహాలు ఇస్తానని చెప్పారు.

తాను ఒక ఇరవై నిమిషాలు మాట్లాడితే తాను చెప్పే మాటలు అతడికి ఉపయోగపడతాయి అని చెప్పుకొచ్చారు. ఆఫ్ స్టాంప్ ఆవల బంతుల విషయంలో కోహ్లీ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ మధ్యకాలంలో ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ కు అవతలి వైపునకు బంతులను ఆడి వికెట్ పోగొట్టుకుంటూ ఉన్నాడని, అతనికి అది ఒక వీక్నెస్ గా మారిందనే చెప్పాలి అని అన్నారు. తనకు తెలిసిన సలహాలను కోహ్లీకి చెబుతాం అని వివరించారు సునీల్ గవస్కర్.

Read more RELATED
Recommended to you

Latest news