ఆగిపోయిన మ్యాచ్ లో పాక్ క్రికెటర్ విధ్వంసం.. ఓవర్ లో 6 సిక్సులు!

-

పాకిస్తాన్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు బాదాడు. క్వెట్టాలోని బుగాటి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన స్పెషల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. మంచి ప్లేయర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన వహాబ్ రియాజ్ బౌలింగ్ లో అతడు ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం.

టాస్ గెలిచిన పేషావర్ జాల్మి జట్టు బౌలింగ్ ఎంచుకోగా, క్వెట్ట గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ లో ఈ అద్భుతం ఆవిష్కారమైంది. ఇఫ్తికార్ హిట్టింగ్ తో రియాజ్ కు ఏం చేయాలో పాలు పోలేదు. చివరి ఓవర్ లో 36 పరుగులు పిండుకోవడంతో క్వెట్ట 184 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్ లో ఆరు సిక్సులు బాదిన ఇఫ్తికార్ 50 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు. బదులుగా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసిన పేషావర్ నాలుగు పరుగుల తేడాతో ఓడింది.

Read more RELATED
Recommended to you

Latest news