New Zealand vs India : టాప్ ఆర్టర్ అట్టర్ ఫ్లాఫ్.. 219 పరుగులకే భారత్ ఆలౌట్..

న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ తడబడింది. 47.3 ఓవర్లలో రన్స్ కే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(51), శ్రేయస్(49), ధావన్(28) మినహా మిగతా బ్యాటర్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.

కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, మిచెల్ చెరో మూడు వికెట్లు తీయగా, సౌథి 2, పెర్గుసన్, మిచెల్ శాట్నర్ చెరో వికెట్ తీశారు. కాగా, టీమిండియా బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ 51 పరుగులు చేసి.. టీమిండియాను ఆదుకున్నాడు. అటు.. రిషబ్‌ పంత్‌ మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు.