సౌతాఫ్రికాపై గెలిచినా.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!

-

మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా తో తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సొంత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్నిత 8 ఓవర్లలో వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ అలవొకగా చేదించింది. ఈ క్రమంలోనే టీమిండియా అత్యంత చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.

టీ20 ఫార్మాట్ లోనే అత్యంత తక్కువ పరుగులు చేసిన ఘోరమైన రికార్డును టీమ్ ఇండియా తమ పేరిట లికించుకుంది. సౌత్ ఆఫ్రికా పేసర్ దాటికి పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డ భారత స్టార్ బ్యాటర్లు, 6 ఓవర్ల పవర్ ప్లే లో కేవలం 17 పరుగులు మాత్రమే చేశారు.

పోనీ వికెట్లు ఏమైనా వెంట వెంటనే ఎక్కువగా పడ్డాయా అంటే అది లేదు. కేవలం కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ మాత్రమే కోల్పోయి, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ క్రిజ్ లో ఉండి కూడా పవర్ ప్లే లో అత్యంత తక్కువ పరుగులు చేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ప్రపంచ క్రికెట్లోనే అంతర్జాతీయ టీ20 లో పవర్ ప్లే ముగిసిన తర్వాత ఇంత తక్కువ పరుగులు చేసిన తొలి జట్టు టీమ్ ఇండియానే. గతంలో 2016లో పాకిస్తాన్ తో మ్యాచ్ లో టీమిండియా పవర్ ప్లే లో 26 పరుగులు చేసిన చెత్త రికార్డును బద్దలు కొట్టుకుని కొత్త చెత్త రికార్డును నమోదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news