BREAKING : పీఎఫ్‌ఐ ట్విటర్‌ ఖాతా నిలిపివేత

-

దేశంలో విద్రోహ చర్యలకు ప్రేరేపిస్తోందన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై నిషేధం విధించింది. పీఎఫ్ఐపై నిషేధం విధించిన మరుసటి రోజే ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ కూడా పీఎఫ్ఐపై చర్యలు చేపట్టింది. పీఎఫ్ఐ ట్విటర్ ఖాతాను నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ట్విటర్ వెల్లడించింది.

ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పీఎఫ్‌ఐపై కేంద్ర హోంశాఖ నిషేధం విధించిన విషయం తెలిసిందే. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పీఎఫ్‌ఐ, ఎనిమిది అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. అయితే, డిజిటల్‌ మాధ్యమం వేదికగా ఈ సంస్థ తమ కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉన్న దృష్ట్యా.. పీఎఫ్‌ఐకి చెందిన అన్ని వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే ట్విటర్‌ నేడు పీఎఫ్‌ఐ ఖాతాలను బ్లాక్‌ చేసింది. పీఎఫ్‌ఐ అధికారిక ట్విటర్‌ ఖాతాకు దాదాపు 81వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news