పాక్ కు షాక్ ఇచ్చిన భార‌త్.. భారీ విక్ట‌రీ

యుద్ధం అయినా.. క్రీడా అయినా.. ఇండియా పాకిస్థాన్ మ‌ధ్య ఉంటే ఆ ఆస‌క్తి ఒక రెంజ్ లో ఉంటుంది. ఏ విష‌యం లో అయినా ఇండియా త‌ప్ప‌క గెల‌వాల‌ని భార‌తీయులు క్రీడా అభిమానులు కోరుకుంటారు. అది క్రికెట్ అయినా.. హాకీ అయినా ఇత‌ర ఆట‌లు అయినా భార‌త్ దే పై చేయి ఉండాల‌ని కోరుకుంటారు. నిజానికి భార‌త్ అన్ని స్థాయి లలో పై చేయి సాధిస్తు.. పాక్ ను చిత్తు చేస్తునే ఉంటుంది. తాజా గా మ‌రొక క్రీడా లో పాక్ ను భార‌త జ‌ట్టు చిత్తు గా ఓడించింది.

అయితే మ‌న దేశ జాతీయ క్రీడా అయిన హాకీ క్రీడా లో పాక్ ను ఇండియా జ‌ట్టు మ‌ట్టి క‌రిపించి దేశ గౌర‌వాన్ని కాపాడారు. అయితే ప్ర‌స్తుతం హాకీ కి సంబంధించి ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫి 2021 టోర్న‌మెంట్ జ‌రుగుతుంది. ఈ టోర్న‌మెంట్ లో భార‌త్ జ‌ట్టు పాక్ జ‌ట్టు తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్ లో పాక్ పై భార‌త్ హాకి జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. 3-1 తేడా తో పాక్ ను మ‌ట్టి క‌రిపించింది. భార‌త జ‌ట్టు వైస్ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్న‌ర్ల ను గోల్స్ గా చేసి భార‌త్ కు విజ‌యం అందించాడు. కాగ ఈ ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ లో భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు రెండు విజ‌యాల‌ను న‌మోదు చేసింది.