IND VS BAN : రేపటి నుంచే వన్డే సిరీస్‌..బంగ్లా కెప్టెన్‌ గా హార్డ్‌ హిట్టర్‌

రేపటి నుంచే ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. హోం సిరీస్ లో భాగంగా భారత్ తో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 4న జరగనున్న తొలి వన్డే తో భారత పర్యటన ప్రారంభం కానుంది. టీమిండియా తో వన్డే సిరీస్ కు బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ తమీమ్ స్థానంలో కెప్టెన్ గా ఆ జట్టు వికెట్ కీపర్-బ్యాటర్ లిటన్ దాస్ ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నియమించింది.

కాగా లిట్టన్ దాస్ కు కెప్టెన్ గా అంత అనుభవం లేదు. అంతకుముందు ఒకే ఒక టీ 20 మ్యాచ్ లో బంగ్లా జట్టుకు సారథ్యం వహించాడు. “లిటన్ దాస్ మా జట్టులో అనుభవజ్ఞుడైన ఆటగాళ్లలో ఒకడు. అదే విధంగా అతడు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ను కూడా కలిగి ఉన్నాడు. అయితే ముఖ్యమైన ఈ సిరీస్ కు తమిమ్ దూరం కావడం చాలా దురదృష్టకరం. గత రెండేళ్లలో అతడి సారథ్యంలో మా జట్టు అద్భుతంగా రాణిస్తోంది. అదేవిధంగా వన్డే ఫార్మాట్ లో అత్యుత్తమ ఆటగాడు” అని బిసిబి క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ జలాల్ యునస్ పేర్కొన్నారు.