స్టైలిష్ బైక్ పై పవన్ కళ్యాణ్ రైడ్.. బైక్ ధర చూసి షాక్ అవుతున్న అభిమానులు..

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హర హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ చిత్రాన్ని సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరిగింది ఈ షూటింగ్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఖాళీ సమయం దొరికినప్పుడు బైక్ వేసుకొని అలా చక్కెర్లు కొట్టారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

 

ప్రస్తుతం పవర్ స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే చిత్రం చేస్తున్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించిన విషయాలతో ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్న పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ ను ఆలస్యం చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక తాజాగా ఈ చిత్రీకరణలో పాల్గొన్న పవన్ లోకేషన్ లో ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ కు బైక్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన ఖరీదైన బైక్ పైన హరహర వీరమల్ల షూటింగ్ గ్యాప్ లో రైట్ చేసిన పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ లో చిరునవ్వులు చిందిస్తూ తిరిగారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. షూటింగ్ గ్యాప్ లో రెండు సార్లు రైడ్ చేసిన పవన్ డిఫరెండ్ కాస్ట్యూమ్స్ లో కనిపించారు. హరిహర వీరమల్లు గెటప్ లో సైతం బైక్ రైడ్ చేసి అభిమానులను అబ్బురపరిచారు. ఇక ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ నడిపిన ఆ బైక్ ధర ఎంతో తెలిస్తే అందరూ వామ్మో అంటారు… పవన్ నడిపిన ఈ బైక్ ప్రముఖ సంస్థ BMW కంపెనీ కు చెందినది. BMW R1250 GS మోడల్ కు చెందిన ఈ బైక్ ధర అక్షరాలా రూ. 24 లక్షలు. ప్రస్తుతం ఈ బైక్ పై పవన్ రైడ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.