ఇవాళ ఇండియా వర్సెస్ ఆసీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇవాళ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే టాస్ నెగ్గిన ఆసీస్.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బౌలింగ్ కు దిగనుంది.
ఇక జట్ల వివరాల్లోకి వెళితే,
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్కాంబ్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్, మాథ్యూ కుహ్నెమాన్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్