నాగ్‌పూర్ విదర్భ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌లో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. లక్ష్య చేధనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 30 పరుగుల తేడాతో భారత్ విజయం విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఓపెనర్ రోహిత్ శర్మను ఔట్ చేసి షాకిచ్చింది. అయితే అనంతరం క్రీజులోకొచ్చిన లోకేష్ రాహుల్ 52 పరుగులతో రాణించాడు. ధావన్ 19 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ మూడు ఫోర్లు, ఐదు సిక్స్‌లతో చెలరేగి ఆడాడు.
62 పరుగులతో బంగ్లా బౌలర్లను కంగారు పెట్టాడు. రిషబ్ పంత్ 6 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. మనీష్ పాండే 22 పరుగులు, శివం దూబే 9 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షఫియుల్ ఇస్లాం, సౌమ్య సర్కార్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా అల్ అమిన్ హొసైన్ ఓ వికెట్ తీసుకున్నాడు. 175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 144 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా, దీపక్ సహార్ ప్రపంచ రికార్డు సృష్టించారు. 3.2 ఓవర్లు వేసిన దీపక్ సహర్ 7 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తోపాటు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కు దీపక్ చాహర్ ఎంపికయ్యాడు.