తడబడి నిలబడిన టీం ఇండియా…!

-

న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి మూడో వన్డేలో టీ ఇండియా తడబడి నిలబడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ముందు నుంచి కూడా కివీస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. పిచ్ సహకారాన్ని అందుకుని కీవీస్ బౌలర్లు చెలరేగిపోయారు. ఆదిలోనే 8 పరుగులకే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (1) వికెట్ కోల్పోయిన టీం ఇండియా ఆ తర్వాత కెప్టెన్ కోహ్లి,(9) వికెట్ కోల్పోయింది.

తొలుత తడబడినా ఆ తర్వాత నిలబడిన యువ ఓపెనర్ పృథ్వీ షా 42 బంతుల్లో రెండు సిక్సులు మూడు ఫోర్లతో అర్ధ సెంచరీకి చేరువ అవుతున్న తరుణంలో 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డు ని ముందుకి నడిపిస్తున్నారు. ఎక్కడా తడబడకుండా చెత్త బంతులను బౌండరీకి తరలిస్తున్నారు.

ఇప్పటికే సీరీస్ కోల్పోయిన టీం ఇండియా ఈ మ్యాచ్ లో విజయం సాధించింది పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది. టి20 సీరీస్ కోల్పోయిన ప్రతీకారంతో ఉన్న కివీస్ జట్టు ఈ మ్యాచ్ ని కూడా గెలిచి క్లీన్ స్వీప్ చెయ్యాలని భావిస్తుంది. తద్వారా తదుపరి టెస్ట్ సీరీస్ కి ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టాలని భావిస్తుంది. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో 33 పరుగులు, కెఎల్ రాహుల్ 35 బంతుల్లో 23 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. 21 ఓవర్లలో జట్టు స్కోర్ మూడు వికెట్ల నష్టానికి 109.

Read more RELATED
Recommended to you

Latest news