భారత్ ఫస్ట్ బ్యాటింగ్, ఓపెనర్లుగా ఆ ఇద్దరు…!

-

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య హామిల్టన్ తొలి వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 5 మ్యాచుల టి20 సీరీస్ ని క్లీన్ స్వీప్ చేసిన టీం ఇండియా ఈ సీరీస్ ని కూడా గెలిచి సొంత గడ్డపై కివీస్ కి షాక్ ఇవ్వాలని భావిస్తుంది. ఈ మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. అందుకే జట్టులో కీలక మార్పులు కూడా చేసినట్టు సమాచారం.

ఇక టీం ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే బ్యాటింగ్ ఆర్డర్ లో కోహ్లీ కీలక మార్పులు చేసాడు. ఓపెనర్లు గా పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ రానున్నారు. వీరిద్దరికీ ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. డోపింగ్ టెస్ట్ లో ఫెయిల్ అయిన పృథ్వీ షా 8 నెలల తర్వాత బ్యాట్ పట్టాడు. మిడిల్ ఆర్డర్ లో కెఎల్ రాహుల్ బ్యాటింగ్ కి రానున్నాడు. టి 20 సీరీస్ లో ఫెయిల్ అయిన శివం దుబేని ఈ మ్యాచ్ లో పక్కన పెట్టారు.

కేదార్ జాదవ్ ని తుది జట్టులోకి తీసుకున్నారు. అలాగే మరో యువ ఆటగాడు మనీష్ పాండే ని కూడా ఈ మ్యాచ్ లో పక్కన పెట్టాడు కోహ్లీ. రోహిత్ శర్మకు గాయం కావడంతో ఈ సీరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇక టీం ఇండియాకు పేస్ బలం బూమ్రా, శమి ఉన్న సంగతి తెలిసిందే. అయితే పిచ్ పేస్ కి అనుకూలించే అవకాశ౦ ఉన్న నేపధ్యంలో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news